
ఆసియా కప్లో టీమిండియా డేంజరస్ ఓపెనర్ అభిషేక్ శర్మ ఒక భారీ రికార్డును సృష్టించాడు. శ్రీలంకతో జరుగుతోన్న సూపర్ ఫోర్ మ్యాచ్లో 34 పరుగులు చేసిన వెంటనే అభిషేక్ శర్మ, టీ20 ఆసియా కప్లో ఒకే ఎడిషన్లో అత్యధిక పరుగులు చేసిన రికార్డును బద్దలు కొట్టాడు. ఈ ఘనత సాధించడానికి అతను పాకిస్తాన్కు చెందిన మహ్మద్ రిజ్వాన్, భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ వంటి ప్రముఖులను అధిగమించాడు. అభిషేక్ ఇప్పటివరకు టోర్నమెంట్లో 282 పరుగులు చేశాడు.