
కోల్ ఇండియా లిమిటెడ్, దాని అనుబంధ సంస్థలు, సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్‌లోని కార్మికులకు పనితీరు ఆధారిత రివార్డు అందజేయనున్నట్టుగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రకటించారు. కార్మికుల నిరంతర ప్రయత్నాలు, కృషికి గుర్తింపు, ప్రశంస, కృతజ్ఞతగా… కోల్ ఇండియా , దాని అనుబంధ సంస్థలకు చెందిన 2.09 లక్షల మంది కార్మికులకు, అలాగే సింగరేణి కాలరీస్‌లోని 38,000 మంది కార్మికులకు ఒక్కొక్కరికి రూ. 1,03,000 చొప్పున అందించబడుతుందని చెప్పారు.