
సాహితీ ఇన్ఫ్రా కేసులో మరో కీలక మలుపు చోటు చేసుకుంది. నటుడు జగపతిబాబు ఇడి విచారణకు హాజర య్యారు. భారీ మోసానికి పాల్పడిందన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న సాహితీ ఇన్ఫ్రా కేసులో భాగంగా, అధికారులు ఆయనను సుదీర్ఘంగా ప్రశ్నించారు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ఆయన ఇడి కార్యాలయానికి రావడం చర్చనీయాంశంగా మారింది. ఆ సంస్థ ప్రకటనల్లో నటించినందుకుగాను ఆయనకు అందిన పారితోషికం, చెల్లింపుల మార్గాలపై వివరాలు సేకరించినట్టు తెలి సింది.