
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఒక సంచలన నిర్ణయం వెల్లడించారు. రష్యాతో యుద్ధం ముగిసిన తర్వాత తాను పదవిని వదులుకుంటానని ఆయన స్పష్టం చేశారు. అధ్యక్ష పదవిని కొనసాగించడం తన లక్ష్యం కాదని చెప్పారు.
ప్రజలకు శాంతిని తీసుకురావడమే తన ప్రాధాన్యం అని స్పష్టం చేశారు. ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంటే పార్లమెంటు చర్చించాలని కూడా కోరారు. యుద్ధం కారణంగా ఉక్రెయిన్లో ఎన్నికలు నిరవధికంగా వాయిదా పడ్డాయి.