
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఓటుకు నోటు కేసులో A4 ముద్దాయిగా ఉన్నా జెరూసలెం మత్తయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో ఆనాడే తాను సరెండర్ అయి అన్ని విషయాలు బైటపెడదామని అనుకున్నానని… కానీ రేవంత్ రెడ్డి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించడంతో ఆగిపోయానని మత్తయ్య తెలిపారు. స్వయంగా రేవంత్ భార్య గీతారెడ్డి తనకు ఫోన్ చేసి సరెండర్ కావద్దని… అయితే తన భర్త ఆత్మహత్య చేసుకుంటానని అంటున్నాడని చెప్పినట్లు మత్తయ్య వెల్లడించారు.