
కర్ణాటక హైకోర్టు తాజాగా ఒక ముఖ్య తీర్పుతో ఎలాన్ మస్క్ ఆధ్వర్యంలోని సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్’కు (మునుపటి ట్విటర్) పెద్ద దెబ్బ కొట్టింది.చట్ట విరుద్దమైన కంటెంట్ పోస్ట్ చేసే ఖాతాలను తొలగించకుంటే కార్యకలాపాలను నిలిపివేస్తామని ప్రభుత్వ అధికారులు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ ఎలాన్ మస్క్‌కు చెందిన మైక్రో బ్లాగింగ్ యాప్ ఎక్స్ (ట్విట్టర్) కార్ప్స్ దాఖలు చేసిన పిటిషన్‌ను కర్ణాటక హైకోర్టు బుధవారం తిరస్కరించింది. సమాచారాన్ని నియంత్రించే అధికారం ప్రభుత్వానికి ఉంటుందని, ఇందులో మీడియాకు సంబంధం లేదని జస్టిస్ నాగప్రసన్న అన్నారు.