
కలియుగ ప్రత్యక్షదైవం వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి . బుధవారం సాయంత్రం 6 గంటలకు ఉత్సవాలను టీటీడీ చైర్మన్ బీఆర్‌నాయుడు, ఈవో అశోక్ సింఘాల్ ఆధ్వర్యంలో పూజల అనంతరం ధ్వజారోహణంతో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఉత్సవాలకు సకల దేవతా మూర్తులను శాస్త్రోక్తంగా ఆహ్వానించే కార్యక్రమమైన గరుడ ధ్వజ పటాన్ని ధ్వజస్తంభం ఎగురవేశారు. ధ్వజస్తంభం మీద ఎగిరే గరుడ పతాకమే సకల దేవతలు, అష్ట దిక్పాలకులు, భూత, ప్రేత, యక్ష, రాక్షస, గంధర్వ గణాలకు శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ఆహ్వాన పత్రమని అర్చకులు వెల్లడించారు.