
ఎయిడ్స్ వ్యాధి వ్యాప్తి నిరోధ చర్యల్లో ఆంధ్రప్రదేశ్ AP ఎయిడ్స్ నియంత్రణ సంస్థకు రెండో ర్యాంకు లభించింది. చికిత్స పొందుతున్న వారిలో 95 శాతం మందిలో వైరల్ లోడ్ తగ్గింది. రాష్టంలోని ఎఆర్‌టి సెంటర్లను సమర్ధవంగా నిర్వహించడం, హెచ్ఐవి అనుమానితులకు పరీక్షలు చేసేందుకు ఉద్దేశించిన టార్గెట్‌డ్ ఇంటర్వెషన్స్, లింక్ వర్కర్స్ స్కీం విభాగాల్లో నూరు శాతం ప్రగతిని సాధించింది. కమ్యూనిటీ ఆర్గనైజేషన్లు, స్వచ్ఛంద సేవా సంస్థలు( ఎన్జీఓలు),
అవుట్ రీచ్ వర్కర్ల ద్వారా ఈ కార్యక్రమాన్ని ఏపీశాక్స్ సమర్ధవంతగా నిర్వహించింది.