
శ్రీశైలంలో దసరా మమోత్సవాలు ప్రారంభమయ్యాయి. 11 రోజుల పాటు జరిగే ఈ మహోత్సవాలు అక్టోబర్ 2వ తేదీతో ముగియనున్నాయి. ఈ నవరాత్రి మహోత్సవాల సందర్భంగా చేపడుతున్న నవదుర్గ అలంకారంలో భాగంగా ఈ సాయంకాలం శ్రీ అమ్మవారి ఉత్సవమూర్తిని శైలపుత్రి స్వరూపంలో అలంకరించారు. ద్విభుజాలను కలిగిన ఈదేవి కుడిచేతిలో త్రిశూలాన్ని, ఎడమచేతిలో పద్మాన్ని ధరించి ఉంటుంది.నవదుర్గలలో ప్రథమ రూపమైన ఈదేవిని పూజించడం వల్ల విశేష ఫలితాలు కలగడంతో పాటు సర్వత్రా విజయాలు లభిస్తాయని చెబుతుంటారు.