
ుక్రవారం రోజున ప్రియాంక గాంధీ ముక్కం మనస్సెరీ ప్రాంతంలోని శ్రీ కున్నత్ మహావిష్ణు ఆలయాన్నిదర్శించుకున్నారు. ఆలయానికి వెళ్లిన ఆమె అరటిపండ్లతో తులాభారం వేయించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు ఆమెకు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం, ఆలయ ప్రాంగణంలో కొత్తగా నిర్మించిన రథాన్ని పరిశీలించిన ఆమె, రథ నిర్మాణంలో పాల్గొన్న శిల్పుల నైపుణ్యాన్ని అభినందించారు.