
ఆసియాకప్‌లో భాగంగా షేక్ జాయెద్ స్టేడియం వేదికగా ఒమాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత్ ఆరంభంలోనే వికెట్ కోల్పోయింది. ఈ మ్యాచ్‌లో భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే షా ఫైజల్ వేసిన రెండో ఓవర్ మూడో బంతికి శుభ్‌మాన్ గిల్(5) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ప్రస్తుతం 3 ఓవర్లు ముగిసేసరికి భారత్ 1 వికెట్ నష్టానికి 22 పరుగులు చేసింది. క్రీజ్‌లో అభిషేక్ శర్మ (15), సంజూ శాంసన్ (1) ఉన్నారు.