ఆరుద్ర నక్షత్రం సందర్భంగా శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున ఆలయంలో స్వర్ణ రథోత్సవం వైభవంగా నిర్వహించారు. మంగళవారం వేకువ జామున స్వామివారికి మహాన్యాసపూర్వకః ఏకాదశ రుద్రాభిషేకం, అన్నాభిషేకం, విశేషపూజలు చేశారు. అనంతరం స్వర్ణరథోత్సవం నిర్వహించారు. ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలంటూ ఆలయ అర్చకులు లోకకల్యాణాని కాంక్షిస్తూ సంకల్పాన్ని పఠించారు. తర్వాత రథంపై ప్రతిష్టించి.. శ్రీస్వామిఅమ్మవార్లకు విశేషపూజలు చేశారు.

