
నేపాల్ అధ్యక్షుడు రామచంద్ర పౌడెల్ సోమవారం నియమితులైన ముగ్గురు మంత్రులతో ప్రమాణస్వీకారం చేయించారు. ఆ ముగ్గురిని కొత్తగా నియమితులైన తాత్కాలిక ప్రధాని సుశీలా కర్కి(73) తన మంత్రివర్గంలోకి చేర్చుకున్నారు. కర్కి నేపాల్ తొలి మహిళా ప్రధానిగా ఆదివారం బాధ్యతలు చేపట్టారు. తర్వాత ఆమె కుల్మాన్ ఘీసింగ్, రామేశ్వర్ ఖనాల్, ఓం ప్రకాశ్ ఆర్యల్ను మంత్రులుగా చేర్చుకున్నారు.