
సోమవారం నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తున్నట్లు నెట్ వర్క్ ఆస్పత్రుల ప్రకటించాయి.ఈ మేరకు ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ కింద సేవలందించే ఏపీ స్పెషాలిటీ ఆస్పత్రుల అసోసియేషన్ ప్రకటించింది. ఓపీడీ సేవలు నిలిపివేయాలని నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి తమకు రావాల్సిన రూ.2,500 కోట్ల బకాయిలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేసింది. రూ.2500 కోట్ల బకాయిలు విడుదల చేయాలని కోరుతూ గత కొన్ని రోజులుగా డిమాండ్లు చేస్తున్నామని అయితే తమ విజ్ఞప్తులను ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు అసోషియేషన్ ప్రకటనలో తెలిపింది.