
మణిపూర్ పర్యటనలో ఉన్న ప్రధాని మోడీ ఇంఫాల్ సభ నుంచే నేపాల్ నూతన ప్రధాని సుశీలా కార్కికి శుభాకాంక్షల సందేశం వెలువరించారు. ఇరు దేశాల మధ్య చిరకాలపు చరిత్ర, విశ్వాసం, సాంస్కృతిక పలు ప్రత్యేకతల బంధం ఉందని చెప్పారు. నేపాల్లో తొలిసారిగా మహిళా ప్రధాని బాధ్యతలు స్వీకరించడం నేపాల్ మహిళా సాధికారికత వెల్లివిరిసిన ఘట్టానికి తార్కాణం అన్నారు. నేపాల్ పరివర్తన దశలో భారత్ ఎల్లవేళలా తోడుగా నిలిచిన విషయాన్ని ఈ నేపథ్యంలో ప్రధాని గుర్తు చేశారు.