
హైదరాబాద్ తరహాలో అమరావతి కూడా మహానగరంగా మారిందని సీఎం చంద్రబాబు తెలిపారు. అమరావతిలో ఇప్పుడు ఉండే భూమి ఇప్పటికే సరిపోతుందన్నారు. అవసరమైన మేరకు రైతులతో మాట్లాడి అమరావతిని అభివృద్ధి చేస్తామని చంద్రబాబు పేర్కొన్నారు. అమరావతి రైతులకు అన్యాయం జరగదని హామీ ఇచ్చారు. అమరావతి అభివృద్ధి కంటిన్యూగా ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతిలో మొత్తం ప్రైవేట్ భూములే ఉన్నాయని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.