
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో గురువారం సాయంత్రం కురిసిన భారీ వర్షం కురిసింది. ఈ భారీ వర్షాలకు పాత కలెక్టరేట్ భవనం కుప్పకూలిపోయింది. పాత భవనంలో కలెక్టర్ కార్యాలయంలోని పలు శాఖలు పనిచేస్తున్నాయి. ట్రెజరీ కార్యాలయంలోని పాతబడిన పైకప్పు భారీ వర్షానికి ఒక్కసారిగా విరిగిపడింది. ట్రెజరీ కార్యాలయం ముందు విధులు నిర్వహిస్తున్న ఇద్దరు పోలీసులు తృటిలో ఈ ప్రమాదం నుంచి బయటపడ్డారు. కార్యాలయం ఆవరణలోని ర్యాకులపై పైకప్పు పడడంతో అందులోని ఫైల్ సైతం ధ్వంసమయ్యాయి.