
ఆసియా కప్ 2025 టోర్నీని భారత జట్టు ఘనంగా ఆరంభించింది. దుబాయ్ వేదికగా ఆతిథ్య యూఏఈతో జరిగిన మ్యాచ్లో 9 వికెట్ల తేడాతో అద్భుత విజయం అందుకుంది భారత్. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన యూఏఈ జట్టు, 13.1 ఓవర్లలో 57 పరుగులకి ఆలౌట్ కాగా.. ఈ లక్ష్యాన్ని 4.3 ఓవర్లలోనే వికెట్ కోల్పోయి ఛేదించింది భారత జట్టు.. వరుసగా 15 మ్యాచుల్లో టాస్ ఓడిన భారత జట్టు, ఎట్టకేలకు దాన్ని బ్రేక్ చేసింది. టాస్ గెలిచిన భారత జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.