
జెనీవాలో జరిగిన ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి (UNHRC) 60వ సెషన్ 5వ సమావేశంలో పాకిస్తాన్, సింగపూర్ దేశాలకు భారత్ ఘాటుగా జవాబు ఇచ్చింది. ఉగ్రవాదాన్ని ఎదుర్కొనే సత్తా భారత్కు ఉందని.. ఎవరి నుంచి నేర్చుకోవాల్సిన, సలహాలు తీసుకోవాల్సిన అవసరం లేదని భారత దౌత్యవేత్త క్షితిజ్ త్యాగి స్పష్టం చేశారు. స్విట్జర్లాండ్ ప్రకటనపై స్పందిస్తూ.. తప్పుడు కథనాలను వ్యాప్తి చేయడానికి బదులుగా తన దేశం(స్విట్జర్లాండ్)లోని సమస్యలైన జాత్యహంకారం, వివక్ష, విదేశీయులపై ద్వేషం వంటి అంశాలపై దృష్టి పెట్టాలని’ హితవు పలికారు.