
గత ఏడాది కాలంగా మేజర్ టైటిల్ కోసం నిరీక్షిస్తున్న పీవీ సింధు మరోసారి నిరాశపరిచింది. హాంకాంగ్ ఓపెన్ సూపర్ 500 టోర్నమెంట్ తొలి రౌండ్లోనే ఓటమి పాలైంది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్‌లో డెన్మార్క్‌కు చెందిన లినే క్రిస్టోఫెర్సెన్ చేతిలో సింధు అనూహ్యంగా కంగుతిన్నది. గతంలో లినేను ఐదుసార్లు చిత్తు చేసిన భారత స్టార్ ఈసారి మాత్రం చేతులెత్తేసింది. పురుషుల సింగిల్స్‌లో హెచ్ఎస్ ప్రణయ్, లక్ష్య సేన్ ముందంజ వేశారు.