
డిఫెండింగ్ ఛాంపియన్ భారత జట్టు ఆసియా కప్‌లో తొలి మ్యాచ్‌కు సిద్దమైంది. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ మైదానంలోయూఏఈని టీమిండియా ఢీకొడుతోంది. టాస్ గెలిచిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ప్రత్యర్థిని బ్యాటింగ్‌కు
ఆహ్వానించాడు. పిచ్‌పై తేమ ఉన్నందున ఆతిథ్య జట్టును తక్కువ స్కోర్‌కే కట్టడి చేయాలనే ఉద్దేశంతోనే బౌలింగ్ తీసుకున్నట్టు సూర్య వెల్లడించాడు. యూఏఈ కెప్టెన్ వసీం సైతం తాము టాస్ నెగ్గినా బౌలింగ్ తీసుకునేవాళ్లమని చెప్పాడు.