
సోషల్ మీడియాపై నిషేధం కారణంగా నేపాల్ ప్రభుత్వ నిర్ణయంపై యువత భారీ నిరసనకు, ఆందోళనకు దిగింది. యువకులు విధ్వంసక చర్యలకు పాల్పడుతున్నారు. కొందరు బిర్గుంజ్ జైలులోకి ప్రవేశించి గేటు తెరిచారు. దీంతో ఆ జైలులోని ఖైదీలు బయటకు పారిపోయారు. జైలు గోడను పగలగొట్టి చాలా మంది ఖైదీలు అక్కడి నుంచి తప్పించుకున్నారు. నేపాల్లోని బిర్గుంజ్ జైలుతో పాటు, అనేక ఇతర జైళ్ల నుంచి ఖైదీలు తప్పించుకున్నారు మహోతారి జైలు నుంచి 576, పోఖారా జైలు నుంచి 900 మంది ఖైదీలు తప్పించుకున్నారు