
టెక్నాలజీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆపిల్ మెగా ఈవెంట్ సమయం దగ్గరపడింది. సెప్టెంబర్ 9న కాలిఫోర్నియాలోని స్టీవ్ జాబ్స్ థియేటర్లో ‘ఆవ్ డ్రాపింగ్’ పేరుతో ఈవెంట్ జరగనుంది. ఈసారి ఆపిల్ నాలుగు కొత్త మోడళ్లు తీసుకురానుంది. అవి ఐఫోన్ 17, ఐఫోన్ 17 ఎయిర్, ఐఫోన్ 17 ప్రో, ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్. వీటిలో అత్యధిక చర్చనీయాంశం ఐఫోన్ 17 ఎయిర్. కేవలం 5.5 మిల్లీమీటర్ల మందంతో ఇది ఇప్పటివరకు వచ్చిన ఐఫోన్లలో అత్యంత సన్నగా నిలవనుంది.