
ఉప రాష్ట్రపతి ఎన్నికల కు దూరంగా ఉండనున్నట్టు ఒడిశా మాజీ సీఎం నవీన్ పట్నాయక్ సారథ్యంలోని బిజూ జనతాదళ్ (BJD) ప్రకటించింది. మంగళవారంనాడు జరుగనున్న ఉపరాష్ట్రపతి ఎన్నికలకు తమ పార్టీ ఎంపీలు దూరంగా ఉంటారని ఆ పార్టీ రాజ్యసభ ఎంపీ సస్మిత్ పాత్ర ఢిల్లీలో తెలిపారు. బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే, కాంగ్రెస్ సారథ్యంలోని ‘ఇండియా’ కూటమికి తమ పార్టీ సమానదూరం పాటించాలనే విధానంలో భాగంగా పార్టీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు.