
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 లో వెరైటీ ఎంట్రీ ఇచ్చాడు జబర్థస్త్ స్టార్ కమెడియన్ ఇమ్మ్యాన్యూయల్, వచ్చీ రావడంతో తన డిఫరెంట్ ఏవీతో ఆకట్టుకున్నాడు. ఏవీలో ఇమ్మ్యాన్యూయల్ పంచ్ లతో నాగార్జున కూడా గట్టిగానే నవ్వుకున్నాడు. ఇక నాగార్జున ముందు లేడీ వాయిస్ తో పాట పాడి ఆశ్చర్చపరిచిన ఇమ్మ్యాన్యూయల్, చిరంజీవి, విజయ్ దేవరకొండ వాయిస్ లను ఇమిటేట్ చేసి అందరిని ఆకట్టుకున్నాడు. అంతే కాదు హౌస్ లో దమ్ము శ్రీజ, హరీష్ కాంపిటేషన్ గా ఫీల్ అవుతున్నట్టు ఇమ్మ్యాన్యూయల్ వెల్లడించాడు.