
పది రోజుల గణేశోత్సవం నేటితో ముగియనున్న నేపథ్యంలో UKలోని ఓ నదిలో భారతీయులు గణేష్ నిమజ్జనం చేస్తున్నట్లు చూపించే ఒక వీడియో ఇంటర్నెట్లో వైరల్ అయింది. ఇందులో సాంప్రదాయ దుస్తులు ధరించిన భారతీయ భక్తుల బృందం పడవలో గణేష్ విగ్రహాన్ని నదిలో నిమజ్జనం చేశారు. ఈ వీడియోపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. సంప్రదాయం పేరుతో విదేశాల్లో నదులను ప్రజలు ఎందుకు కలుషితం చేస్తున్నారు? అని నెటిజన్ ప్రశ్నించగా “మనం ఎక్కడ ఉన్నా భారతీయ సంస్కృతి ఎంత లోతుగా పాతుకుపోయిందో ఇది చూపిస్తుంది” అని మరొకరు వ్యాఖ్యానించారు.