
వైఎస్సార్సీపీ రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డికి రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు. ఆయనకు మధ్యంతర బెయిల్ లభించడంతో శనివారం మధ్యాహ్నం ఆయన జైలు నుంచి బయటికి వచ్చారు. ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటేసేందుకు అనుమతిస్తూ ఏసీబీ కోర్టు శనివారం మిథున్ రెడ్డికి బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.తిరిగి 11వ తేదీన సరెండర్ కావాలని ఆయన్ని కోర్టు ఆదేశించింది.