
ఉల్లిపాయ ధరలు పెరిగిపోతున్న సమయంలో కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. తక్కువ ధరకే ఉల్లిపాయల్ని అమ్ముతోంది. మూడు పెద్ద నగరాల్లో మొబైల్ వాన్లు, స్టాళ్ల ద్వారా ఉల్లిపాయల అమ్మకం మొదలైంది. ప్రభుత్వం రూ.24 కిలో ధరకి ఉల్లిపాయలు అమ్ముతోంది. ఢిల్లీ, ముంబై, అహ్మదాబాద్‌లో అమ్మకం మొదలైంది. ఇవి మొబైల్ వాన్లు, నాఫెడ్, ఎన్‌సీసీఎఫ్, కేంద్రీయ భండార్ అనే సహకార సంస్థల స్టేషనరీ స్టాళ్ల ద్వారా అమ్ముతున్నారు. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషీ మొబైల్ వ్యాన్లను జెండా ఊపి పంపించారు.