
తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాల కారణంగా పలు జిల్లాలు వరదలకు గురయ్యాయి పరిస్థితిని స్వయంగా పరిశీలించడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు కామారెడ్డికి వెళ్లారు. తాడ్వాయి మండలంలోని ఎర్రపహాడ్ గ్రామానికి చేరుకున్న ఆయన.. వరద బాధితులను కలుసుకుని పరామర్శించారు. వరదల సమయంలో బలహీనంగా మారిన లింగంపల్లికుర్దు ఆర్ అండ్ బి బ్రిడ్జిని సీఎం పరిశీలించారు. పొలాల్లో ఇసుక మట్టిపాలైపోయినట్లు, వరదల వల్ల పంటలు పూర్తిగా నాశనం అయ్యాయని, గృహాలు కూడా మునిగిపోయి జీవనోపాధి దెబ్బతిన్నదని తెలిపారు. బాధాకర పరిస్థితిని విన్న సీఎం ప్రజలను ఓదార్చారు.