
SCO సదస్సులో ప్రధాని మోడీని కలవడం, స్వాగతం పలకడం ఆనందంగా ఉందని జిన్‌పింగ్ అన్నారు. చైనా-భారత సంబంధాలు మళ్ళీ పుంజుకుంటున్నాయని చైనా, భారతదేశాలు రెండు ప్రాచీన నాగరికతలు, ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశాలు, గ్లోబల్ సౌత్‌లో ముఖ్య సభ్యులం” అని, ఈ సంవత్సరం భారత్-చైనా దౌత్య సంబంధాలకు 75వ వార్షికోత్సవం. “రెండు దేశాలు వ్యూహాత్మక దృక్పథంతో, దీర్ఘకాలిక దృష్టితో సంబంధాలను చూడాలి, నిర్వహించాలి” అని జిన్‌పింగ్ అన్నారు. ప్రధాని మోడీ కూడా రెండు దేశాల మధ్య ప్రాచీన సంబంధాలను ఈ సమావేశంలో ప్రస్తావించారు.