
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ను కలవడానికి ముందు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం (ఆగస్టు 30 ) ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీతో మాట్లాడారు. ఆగస్టులో ఇద్దరు నాయకుల మధ్య జరిగిన రెండవ టెలిఫోన్ సంభాషణ ఇది. జెలెన్స్కీతో జరిగిన సంభాషణ గురించి ప్రధాన మంత్రి కార్యాలయం నుంచి ఒక ప్రకటన వెలువడింది. ఉక్రెయిన్ నాయకుడి పిలుపునకు ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలిపారు. రష్యా-ఉక్రెయిన్ మధ్య శాంతి పునరుద్ధరణకు భారతదేశం మద్దతును పునరుద్ఘాటించారు.