
గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా కోదండరాం, అజారుద్దీన్ పేర్లను సిఫారసు చేస్తూ తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపింది. అయితే లిస్ట్‌లో అమీర్ అలీ ఖాన్ పేరు తొలగించి..అజారుద్దీన్‌కు స్థానం కల్పించింది ప్రభుత్వం. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నుంచి మజ్లిస్ అభ్యర్థిగా పోటీచేసిన నవీన్ యాదవ్ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ముస్లిం మైనారిటీ ఓటర్లు కీలకంగా ఉన్న నేపథ్యంలో మజ్లిస్ పార్టీ మద్దతు కూడా తప్పనిసరి. ఈ క్రమంలోనే.. నవీన్ యాదవ్ పేరు తెరపైకి వచ్చినట్లు తెలుస్తోంది.