
మాజీ మంత్రి కేతిరెడ్డి పెద్దారెడ్డి కి తాడిపత్రిలోకి ప్రవేశించేందుకు సుప్రీంకోర్టు అనుమతి ఇవ్వడంపై స్థానిక టీడీపీ నేత, మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఘాటుగా స్పందించారు. పెద్దారెడ్డి రాకను తాను అడ్డుకోవడం లేదని, కానీ గతంలో ఆయన అక్రమాలకు, దౌర్జన్యాలకు బలైన బాధితులే వ్యతిరేకిస్తున్నారని జేసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎంతోమంది టీడీపీ కార్యకర్తలపై పీడీ యాక్ట్ కింద అక్రమ కేసులు నమోదు చేయించి, జిల్లా నుంచి బహిష్కరించాడు” అని విమర్శించారు.