
ప్రధాని మోదీకి జపాన్లో ఘన స్వాగతం లభించింది. భారతీయ సంప్రదాయంలో జపాన్ మహిళలు.. ఆయనకు ఆహ్వానం పలికారు. గాయత్రీ మంత్రంతో పాటు భజనలతో అపూర్వ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆ మహిళలను ప్రధాని మోదీ అభినందించారు. ఇక తన జపాన్ పర్యటన.. రెండు దేశాల మధ్య సాంస్కృతిక సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.