
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో కురుస్తున్న కుండపోత వర్షాల కారణంగా కృష్ణా, గోదావరి నదులకు భారీగా వరద పోటెత్తుతోంది. ఈ వరద ప్రవాహం శ్రీశైలం, శ్రీరాంసాగర్ ప్రాజెక్టుల జలకళను పెంచింది. కృష్ణా నదిపై ఉన్న శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద వచ్చి చేరుతోంది. 10 స్పిల్‌వే గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు, ప్రాజెక్టు నుంచి విద్యుత్ ఉత్పత్తికి, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్‌కు కూడా నీటిని విడుదల చేస్తున్నారు. నది పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.