
హైదరాబాద్ తో సహా పలు జిల్లాలో కుండపోత వానలు పడుతున్నాయి… ఇవి రేపు (ఆగస్ట్ 28, గురువారం) కూడా కొనసాగుతాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది… తెలంగాణలోని నాలుగు జిల్లాల్లో గురువారం భారీ నుండి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయట… అందుకే ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఇలా నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో ఇంకోరోజు కుండపోత వానలు తప్పవట… కాబట్టి ఆ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.