
పశ్చిమ కుర్స్క్‌లోని తమ అణు విద్యుత్ కేంద్రంపై ఉక్రెయిన్ డ్రోన్‌లతో దాడులు చేసిందని రష్యా ఆరోపించింది. ఉక్రెయిన్ 34 స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రాత్రంతా దాడులు కొనసాగిస్తూనే ఉందని పేర్కొంది. ఈ దాడుల్లో పలు విద్యుత్, ఇంధన సౌకర్యాలను లక్ష్యంగా చేసుకుందని రష్యా అధికారులు తెలిపారు. ఈ దాడిలో ట్రాన్స్‌ఫార్మర్ దెబ్బతిందని, రేడియేషన్ స్థాయిలు సాధారణంగా ఉన్నట్టు తెలిపింది. ఈ ఘటనపై అంతర్జాతీయ అణు శక్తి సంస్థ (IAEA) సైతం స్పందించింది. ‘