ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎరువుల ధరలను అడ్డగోలుగా పెంచి అమ్ముతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వ్యవసాయేతర అవసరాల కోసం యూరియాను తరలించకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రైవేట్ డీలర్లకు ఎరువుల కేటాయింపులను తగ్గించి, మార్క్ఫెడ్ ద్వారానే ఎక్కువగా సరఫరా జరిగేలా చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు విజిలెన్స్ బృందాలు విస్తృతంగా తనిఖీలు చేసి, ఎరువుల అక్రమ నిల్వలను, అక్రమ అమ్మకాలను అరికట్టాలని ఆదేశించారు.

