
బిహార్‌లో జరిగిన ఓ ర్యాలీలో కాంగ్రెస్ నాయకులు.. దేశ ప్రజలందరి దృష్టిని ఆకర్షించారు. ముఖ్యంగా భారత కూటమి నాయకులు రాహుల్ గాంధీ, తేజస్వీ యాదవ్ ఇద్దరూ కలిసి.. బుల్లెట్ బైకుపై ప్రయాణించారు. తమ ‘ఓటర్ అధికార్ యాత్ర’కు సరికొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చారు. ఈయాత్రలో భాగంగానే రాహుల్ గాంధీ, తేజస్వీ యాదవ్ ఇద్దరూ అరేరియాలోకి ప్రవేశించగా.. ఇద్దరూ కలిసి బుల్లెట్ బైక్‌లపై ప్రయాణించారు. తేజస్వి యాదవ్, రాహుల్ గాంధీలు బైక్ నడుపుతుండగా.. వెనుక కార్యకర్తలు కూర్చున్నారు.