
స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం పెద్దాపురంలో పర్యటించిన ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పారిశుద్ధ్య కార్మికుల సంక్షేమం కోసం ప్రమాద, ఆరోగ్య బీమా స్కీంను లాంఛనంగా ప్రారంభించారు పట్టణాభివృద్ధి శాఖ-ఆక్సిస్ బ్యాంక్ సంయుక్తంగా ఈ స్కీంను అమలు చేసేలా ఒప్పందం కుదిరింది శాశ్వత ఉద్యోగులకు ఒక రూ. 1 కోటి వరకు ప్రమాద బీమా, పది లక్షల లైఫ్ కవర్ లభించనుంది. ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు ఇరవై లక్షల ప్రమాద బీమా, రెండు లక్షల లైఫ్ కవర్ సదుపాయం ఉంటుంది.