
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి, విజయవాడ, గుంటూరు, తెనాలి మీదుగా గ్రీన్ ఫీల్డ్ ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి అవసరమైన భూముల సమాచారాన్ని అధికారులు సేకరిస్తున్నారు. గ్రామాల వారీగా పంట భూముల సర్వే నంబర్లు, ఎల్పీఎం నంబర్ల వివరాలను సేకరిస్తున్నారు. వట్టిచెరుకూరు మండలంలో శుక్రవారం అధికారులు భూముల సమాచారం సేకరించారు. అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు వెళ్తున్నట్లు సూచిక బోర్డులు ఏర్పాటు చేశారు. సత్తెనపల్లి రెవెన్యూ డివిజన్ పరిధిలో భూసేకరణ ప్రక్రియకు కసరత్తు జరుగుతోంది. పెదకూరపాడు, అమరావతి మండలాల్లో భూసేకరణ చేపట్టనున్నారు.