
చిరంజీవి (జ. 1955 ఆగస్టు 22) తెలుగు చలన చిత్ర నటుడు, రాజకీయ నాయకుడు.అతని అసలు పేరు కొణిదెల శివశంకర వరప్రసాద్. మెగాస్టార్గా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడు. చిరంజీవి 150కి పైగా చిత్రాల్లో నటించాడు. వీటిలో ఎక్కువభాగం తెలుగు చిత్రాలు. మిగతావి తమిళ, కన్నడ, హిందీ చిత్రాలు. 39 ఏళ్ళకు పైబడ్డ నట ప్రస్థానంలో మూడు సార్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నంది పురస్కారాలు, రఘుపతి వెంకయ్య బహుమతి, తొమ్మిది ఫిల్మ్ ఫేర్ సౌత్ బహుమతులు గెలుచుకున్నాడు.