
చిరంజీవి బర్త్ డే కానుకగా ఈ గ్లింప్స్ ని తీసుకువచ్చారు. మల్లిడి వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న విశ్వంభర మూవీ చాలా కాలంగా వాయిదా పడుతూ వస్తోంది. గతంలో విశ్వంభర టీజర్ రిలీజ్ అయినప్పుడు విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్ పై పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరిగింది. దానిని చిత్ర యూనిట్ బాగా సీరియస్ గా తీసుకున్నట్లు ఉన్నారు. లేటెస్ట్ గ్లింప్స్ లో గ్రాఫిక్స్ మైండ్ బ్లోయింగ్ అనిపించేలా ఉన్నాయి.