
తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీ అధ్యక్షుడు, నటుడు విజయ్ మధురైలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. తమ పార్టీ ఏ ఇతర పార్టీతోనూ కలవదని, బీజేపీతో కలుస్తుందనే అపోహలను ఆయన ఖండించారు.టీవీకే ఏ మతానికి వ్యతిరేకం కాదని, ఇది ప్రజల పార్టీ అని విజయ్ నొక్కిచెప్పారు. తన పార్ట ఎన్నికలకు సిద్ధంగా ఉందని అధ్యక్షుడు విజయ్ తెలిపారు. తమిళ ప్రజలకు సేవ చేయడమే తన లక్ష్యమని, వారి మద్దతుతో ఎన్నికల్లో విజయం సాధిస్తామని విజయ్ ఆశాభావం వ్యక్తం చేశారు.