
అస్సాంలోని ప్రఖ్యాత కామాఖ్యా దేవి ఆలయానికి సందర్శించుకోవడనికి వెళ్లగా.. వేణు స్వామిని అడ్డుకున్నారు. గుడి లోపలకు రాకుండా బయటకు పంపించేశారు. సంతానం లేనివారు కామాఖ్యా అమ్మవారి ఆలయం కొండపైన కలిస్తే.. ఏడాదిలోపు పిల్లలు పుడతారని,అమ్మవారికి నైవేద్యంగా మాంసాహారం సమర్పించాలని అపచారపు మాటలు మాట్లాడడం సరికాదని పండితులు హెచ్చరించారు. లక్షల్లో డబ్బులు తీసుకుని ఇక్కడ పూజలు నిర్వహించడంపై కూడా కామాఖ్య ఆలయ సిబ్బంది ఆగ్రహానికి మరో కారణం.