
ఆంధ్రప్రదేశ్‌లో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌కు నాంది పలికింది. మంగళగిరి మయూరి టెక్ పార్క్ ప్రాంగణంలో సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ లాంఛనంగా ఈ హబ్‌ను ప్రారంభించారు. అమరావతిని కేంద్రంగా తీసుకుని రూపుదిద్దుకుంటున్న ఈ హబ్ డీప్‌టెక్, కృత్రిమ మేధ (AI), సుస్థిర ఆవిష్కరణలు, సమ్మిళిత టెక్నాలజీలకు వేదిక కానుంది. 50 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మితమవుతున్న ఈ హబ్ భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని స్టార్టప్‌లకు కొత్త దిశగా నిలవనుందని అధికారులు వెల్లడించారు.