
భారత అంతరిక్ష యాత్రికుడు, గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా సోమవారం ప్రధాని నరేంద్ర మోడీని ఢిల్లీలోని ఆయన నివాసంలో కలిశారు. “శుభాంశు శుక్లాతో విస్తృతంగా చర్చించాను. అంతరిక్షంలో ఆయన అనుభవాలు, విజ్ఞానం-సాంకేతికత అభివృద్ధి, గగన్ యాన్ మిషన్ పురోగతి వంటి అంశాలపై చర్చించాం. ఆయన విజయంపై భారతదేశం గర్విస్తోంది” అని అన్నారు. శుభాంశు శుక్లా తనతో పాటు అంతరిక్ష కేంద్రంలోకి తీసుకెళ్లిన భారత త్రివర్ణ పతాకాన్ని ప్రధానికి అందజేశారు.
అలాగే ఆక్సియమ్-4 అధికారిక మిషన్ ప్యాచ్‌ను కూడా ప్రధానికి బహుమతిగా ఇచ్చారు.