
అమెరికాలోని ఇండియన్ గ్రోసరీ స్టోర్స్‌లో రాత్రికి రాత్రే ధరలు ఆకాశాన్ని తాకాయి. అదీ కూడా కొత్త టారిఫ్‌లు ఇంకా అమలులోకి రాకముందే ఈ పరిస్థితి వారికి ఎదురయ్యింది. అమెరికాలోని ఎన్నారైలు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఫ్రోజెన్ పరాఠాలు లాంటి వస్తువుల ధరలు రాత్రికి రాత్రే 11.99 డాలర్లు నుంచి 13.99 డాలర్లకు పెరిగాయట. మామూలుగా ఏదైనా వస్తువు ధర పెరిగితే, రూపాయిలో 10, 20 పైసలు పెరుగుతుంది. మహా అయితే ఒక రూపాయి పెరుగుతుంది. కానీ అమెరికాలో దాదాపు 2 డాలర్లు పెరిగినట్టే.