
దివంగత నటుడు కోట శ్రీనివాసరావు మరణించిన నెల రోజుల వ్యవధిలోనే ఆయన కుటుంబంలో మరో విషాదం చోటుచేసుకుంది. కోట శ్రీనివాసరావు భార్య రుక్మిణి సోమవారం తెల్లవారుజామున హైదరాబాద్ లోని తన నివాసంలో కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రుక్మిణి పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు. ఈరోజు ఆమె అంత్యక్రియలు పూర్తయ్యాయి.