
కర్ణాటకలోని ప్రసిద్ధ యాత్రా క్షేత్రం ‘ధర్మస్థల’ కేసులో వందలాది మృతదేహాలను ఖననం చేశానని ప్రకటించి సంచలనం రేపిన పారిశుద్ధ్య కార్మికుడు తన వాంగ్మూలాన్ని మార్చాడు. తాను కొంత మంది బలవంతంపై ఈ ప్రకటన చేశానని షాకింగ్ కామెంట్స్ చేశారు. దీంతో కేసు ఊహించని మలుపు తిరిగింది. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (SIT) ముందు హాజరైన ఆయన, తాను స్వచ్ఛందంగా ముందుకు రాలేదని, కొందరి ఒత్తిడితో తప్పుడు ప్రకటన ఇచ్చానని సంచలన ఆరోపణలు చేశారు.